Thursday, July 24, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్విద్యాసంస్థలు బంద్ విజయవంతం: ఎస్ఎఫ్ఐ

విద్యాసంస్థలు బంద్ విజయవంతం: ఎస్ఎఫ్ఐ

- Advertisement -

విద్యాశాఖ మంత్రి నియమించాలి 
స్కాలర్షిప్స్, ఫీజు రియంబర్స్మెంట్, బెస్ట్ అవైలబుల్ స్కీం బకాయిలు విడుదల చేయాలి
విద్య హక్కు చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలి 
ఫీజు నియంత్రణ చట్టం తీసుకురావాలి 
ప్రయివేట్ పాఠశాల పై అధికారులు చర్యలు తీసుకోవాలి
ఎన్ ఈ పి- 2020 రద్దు చేయాలి : ఎస్ఎఫ్ఐ డిమాండ్
నవతెలంగాణ – తాడ్వాయి 

వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా విద్యారంగ సమస్యల పరిష్కారానికై ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల కళాశాలల బంధు బుధవారం నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా తాడ్వాయి మండలంలోని ప్రభుత్వ పాఠశాలలు, ఆశ్రమ గురుకుల పాఠశాలలో, కళాశాలలు బందు విజయవంతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ మండల ఉపాధ్యక్షులు వరుణ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం దాటిన, ఇంకా విద్యా శాఖ మంత్రిని నియమించకపోవడం బాధాకరం అన్నారు. గత కొన్ని సంవత్సరాలుగా 8600 కోట్ల రూపాయలు పెండింగ్ స్కాలర్షిప్స్, ఫీజు రియంబర్స్మెంట్ ఉన్నాయని వెంటనే తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

నూతన జాతీయ విద్యా విధానాన్ని అసెంబ్లీలో తీర్మానం చేయాలని, ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ, లెక్చరర్, ఎంఈఓ, డీఈవో పోస్టులను వెంటనే భర్తీ చేయాలన్నారు. అద్దె భవనాల్లో నడుస్తున్న పాఠశాలలకు కళాశాలకు హాస్టల్ కు సొంత భవనాలు నిర్మించాలని అన్నారు. పెండింగ్ లో ఉన్న మెస్, కాస్మెటిక్స్ బకాయిలను కూడా విడుదల చేయాలన్నారు. ప్రైవేటు విద్యాసంస్థల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు భద్రత కల్పించాలని తెలిపారు. ప్రైవేట్, కార్పొరేట్ యాజమాన్యుల ఫీజు నియంత్రణ చట్టం తీసుకురావాలని, మండలంలోని కొన్ని ప్రైవేటు పాఠశాలలో మౌలిక సదుపాయాలు లేవు విద్యార్థులకు ఆడుకోవడానికి గ్రౌండ్ లేనటువంటి పరిస్థితి నెలకొందని చెప్పారు. తెలంగాణ లో బడుగు బలహీన వర్గాల నుంచి వచ్చిన మండల కేంద్రంలో జూనియర్ కళాశాలలో చదువుతున్న విద్యార్థులకు బస్సు రవాణా సౌకర్యం కల్పించి బస్సు ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలని వారు అన్నారు. ఖాళీగా ఉన్న టీచర్, ఎంఈఓ, డీఈవో పోస్టులను వెంటనే భర్తీ చేయాలన్నారు. ఎన్ఈపి 20-20 రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల భారత విద్యార్థి ఫెడరేషన్ విద్యార్థి నాయకులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -