Monday, October 27, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్30న విద్యాసంస్థల బంద్: ఎస్ఎఫ్ఐ

30న విద్యాసంస్థల బంద్: ఎస్ఎఫ్ఐ

- Advertisement -

నవతెలంగాణ – వనపర్తి
ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌ల సమస్యపై అక్టోబరు 30న తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విద్యా సంస్థలు బంద్ చేయాలని ఎస్ఎఫ్ఐ వనపర్తి జిల్లా కార్యదర్శి ఎం.ఆది పిలుపునిచ్చారు. బందుకు సంబంధించిన వాల్ పోస్టర్లను వనపర్తి జిల్లా కేంద్రంలోని సిద్ధార్థ డిగ్రీ కళాశాలలో సోమవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ బంద్ రాష్ట్రంలోని ఇంజనీరింగ్, పీజీ, డిగ్రీ కళాశాలలు, యూనివర్సిటీలకు వర్తిస్తుందన్నారు. ప్రభుత్వం బకాయిపడిన 8,600 కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ మొత్తాలను వెంటనే విడుదల చేయాలని ఎస్ ఎఫ్ ఐ డిమాండ్ చేస్తోందని అన్నారు. బంద్ కు వనపర్తి జిల్లా వ్యాప్తంగా ఉన్న కళాశాలల యాజమాన్యాలు సహకరించాలని, విద్యార్థులు బందులో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. పోస్టర్ ఆవిష్కరణలో ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ సభ్యులు వీరన్న నాయక్, ఈశ్వర్, శివ, మహేష్, ప్రసాద్ విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -