- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: ఢిల్లీ పోలీసు కమిషనర్ గా సతీష్ గోల్చా( Satish Golcha)ను నియమించారు. ఢిల్లీ పోలీసు శాఖలో ఆయన 26వ కమీషనర్. సతీష్ నియామకంపై ఇవాళ కేంద్ర హోంశాఖ ఆదేశాలు జారీ చేసింది. బుధవారం ఢిల్లీ సీఎం రేఖా గుప్తాపై దాడి ఘటన జరిగిన నేపథ్యంలో.. పోలీసు కమీషనర్‌ను మార్చేశారు. సతోష్ గోల్చా 1992 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ ఆఫీసర్. అదనపు కమిషనర్ గా చేస్తున్న ఎస్బీకే సింగ్ స్థానంలో సతీష్‌ను నియమించారు.
- Advertisement -