నవతెలంగాణ – వర్ధన్నపేట :
ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న పై కల్వకుంట్ల కవిత దాడి చేయించడాన్ని నిరసిస్తూ వరంగల్ జిల్లా వర్ధన్నపేట మున్సిపాలిటీ పట్టణ కేంద్రంలో
కల్వకుంట్ల కవిత దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. కల్వకుంట్ల కవితకు చెందిన జాగృతి గుండాలు ఆదివారం రోజున హత్యయత్నానికి పాల్పడ్డారని బిసి ఐక్యవేదిక ,
తీన్మార్ మల్లన్న టీం, ఖమ్మం వరంగల్ ప్రధాన రహదారిపై ధర్నా నిరసన చేపట్టి కవిత దిష్టిబొమ్మ దగ్ధం చేశారు కవిత ఖబర్దార్ అంటూ నినాదాలు చేశారు.
ఈ సందర్భంగా బీసీ ఐక్య వేదిక, తీన్మార్ మల్లన్న టీం సభ్యులు మాట్లాడుతూ. బీసీల తరుపున గళం ఎత్తి దశాబ్దాల కాలం నుండి వారిపై జరుగుతున్న అన్యాయాలను నిరంతరం ప్రజలకు వివరిస్తున్న తీన్మార్ మల్లన్న పై దాడి చేయడం నీచమైన చర్య అని వారు విమర్శించారు మల్లన్న పై దాడి జరిగితే బీసీలందరిపై దాడి జరిగినట్లే అన్నారు. కల్వకుంట కవితకు బీసీలపై ప్రేమ ఉంటే 10 ఏండ్లు అధికారంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బీసీలపై జరుగుతున్న అన్యాయం గురించి గాని బీసీల రిజర్వేషన్లను 33 శాతం నుండి 22 శాతానికి కేసీఆర్ తీసుకొచ్చినప్పుడు ఈనాడు స్పందించలేదని వారు మండిపడ్డారు. సారా దందా చేసి అడ్డంగా దొరికి జైలుకు పోయొచ్చిన కవితకు, బీసీలతో ఏంటి సంబంధమని, ప్రశ్నించారు కవితను సొంత అన్న తండ్రి పట్టించుకోవడం లేదన్నారు జాగృతి పేరుతో ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ఇలాంటి దాడులు ఎన్ని చేసిన తీన్మార్ మల్లన్న, బీసీ సమాజం భయపడదన్నారు. ఈ కార్యక్రమంలో వర్ధన్నపేట బీసీ ఐక్య వేదిక నాయకులు & తీన్మార్ మల్లన్న టీం వర్ధన్నపేట మండల అధ్యక్షులు ఆకుల మనోజ్,బీసీ ఐక్య వేదిక వ్యవస్థాపక నాయకులు పూజారి రాజు,ఆరేల్లి నాగార్జున,ఆవుల ప్రవీణ్,నోముల గౌరవ్, తీన్మార్ మల్లన్న టీం పాలకుర్తి ఇంచార్జి గాడిపెల్లి యాకన్న,తీన్మార్ మల్లన్న టీం పెద్ద వంగర మండల ఇంచార్జి గారిగంటి నవీన్,బీసీ ఐక్య వేదిక సభ్యులు గాoడ్ల రమేష్,మామిండ్ల చెన్నయ్య, నోముల గౌరవ్,బూర అశోక్,మడత ప్రశాంత్,గూబ అజయ్,సమ్మెట రాజు తదితర బీసీ నాయకులు పాల్గొన్నారు.
మల్లన్న పై దాడికి నిరసనగా కవిత దిష్టి బొమ్మ దగ్ధం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES