గెలుపు దిశలో పెద్దతూండ్ల సర్పంచ్ అభ్యర్థి నర్సింగరావు
నవతెలంగాణ – మల్హర్ రావు
రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీదర్ బాబు సహకారంతో అన్నివర్గాల ప్రజల సంక్షేమమే ద్యేయంగా కృషి చేస్తానని కాంగ్రెస్ పార్టీ బలపర్చిన పెద్దతూoడ్ల గ్రామ సర్పంచ్ అభ్యర్థి బండారి నర్సింగరావు అన్నారు. ప్రచారంలో భాగంగా గడపగడపకు అన్నివర్గాల ప్రజలు బ్రహ్మరథం పట్టడంతో గెలుపు దిశలో దూసుకెళుతున్నారు. తన క్రికెట్ బ్యాట్ గుర్తుకు తమ అమూల్యమైన ఓటువేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని, తాను గెలిసిన వెంటనే మంత్రి సహకారంతో గ్రామంలో ఉన్న దీర్ఘకాలిక, స్వల్పకాలిక సమస్యలు పరిస్కారం అయ్యేలా చూస్తానన్నారు. అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తానన్నారు. నర్సింగరావు గ్రామంలో అన్ని వర్గాల ప్రజలకు తలలో నాలుకలా ఉండడంతో ఆయా కుల సంఘాలు సంపూర్ణ మద్దతి ప్రకటిస్తున్నారు. దీంతో నర్సింగరావు గెలుపు ఖాయమైనట్లుగా పురవీధుల్లో పలువురు చర్చించుకుంటున్నారు.
మంత్రి శ్రీధర్ బాబు సహకారంతో అన్ని వర్గాల సంక్షేమానికి కృషి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



