– మధ్యమిక విద్యాశాఖ అధికారి జాదవ్ పరశురాం
నవతెలంగాణ-కుభీర్ : మండల కేంద్రమైన కుభీర్ ప్రభుత్వ జూనియర్ కాలశాలలో చదువుకునే విద్యార్థులకు మంచి విద్య బోధన అందించేలా కృషి చేయాలని జిల్లా మధ్యమిక విద్యాధికారి జాదవ్ పరశురాం అన్నారు. శనివారం మండల లోని ప్రభుత్వ జూనియర్ కళాశాలను అకస్మికంగా తనిఖీ చేశారు.ఈ సందర్బంగా జిల్లా అధికారి పరశురాం విద్యార్థుల తరగతి గదిలోకి వెళ్లి విద్యార్థులను పలు సూచనలు సలహాలు అడిగి తెలుసుకున్నారు. దింతో పాటు రానున్న పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించేందుకు ఇప్పటి నుంచే ప్రణాళిక బద్దంగా చదివి మంచి ఫలితాలు తెచ్చుకునేలా చూడాలని తెలిపారు. అదే విదంగా కళాశాల అధ్యాపకులకు విద్యార్థులకు అర్థముయ్యే రీతిలో చదువులు చెప్పేలా చూడాలని అన్నారు.. దింతో పాటు ముఖ్యంగా విద్యార్థులు ప్రతి రోజు కళాశాలకు హాజరై అధ్యాపకులు చెప్పిన పాఠాలు శ్రద్దగా వింటే మంచి ఫలితాలు తప్పకుండ వస్తాయని అన్నారు. విద్యార్థుల హాజరు శతం పెంచాలా చూడాలని కళాశాల ప్రిన్సిపాల్ సునీల్ కుమారు కు సూచించారు.కళాశాలలో విద్యార్థులకు స్నాక్స్ ఇచ్చే కార్యక్రమం చేపట్టడం తో కళాశాల అధ్యాపక బృందాన్ని అభినదించారు. ఈ కార్యక్రమం లో కళాశాల ప్రిన్సిపాల్ సునీల్ కుమార్ అధ్యాపకులు విద్యార్థులు తదితరులు ఉన్నారు.
విద్యార్థులకు మంచి విద్య బోధన అందించేలా కృషి చేయాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



