Monday, August 11, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్ఆర్యవైశ్యుల పట్టణ సంఘం అభివృద్ధికి కృషి

ఆర్యవైశ్యుల పట్టణ సంఘం అభివృద్ధికి కృషి

- Advertisement -

అధ్యక్ష అభ్యర్థి అర్వపల్లి పురుషోత్తం గుప్తా
నవతెలంగాణ – కంఠేశ్వర్ 
: జూలై ఆరవ తేదీన ఆదివారం ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు శివాజీ నగర్ లోని శ్రీ నూతన వైశ్య ఉన్నత పాఠశాల మాణిక్భవన్లో అధ్యక్ష, కార్యవర్గ ఎన్నికలు నిర్వహించనున్నట్లు అధ్యక్ష అభ్యర్థి అర్వపల్లి పురుషోత్తం గుప్తా పేర్కొన్నారు. సోమవారం నగరంలోని ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పట్టణం పట్టణంలోని ఆర్యవైశ్యులంతా తనకు మద్దతు తెలిపి, ఈ ఎన్నికల్లో శాశ్వత సభ్యులు తమ అమూల్యమైన ఓటు వేసి అలాగే తమ ప్యానెల్ సభ్యులను కూడా అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. తాము చేసేదే చెప్తామని చెప్పింది చేస్తామని ఆయన అన్నారు. తాము ఆర్యవైశ్య సంఘం పట్టణ అధ్యక్షుడిగా 2001 నుండి 27వ సంవత్సరం వరకు సేవలు అందించాలని, ఆ సమయంలోనే ఆర్యవైశ్యులకు ఒక కళ్యాణ మండపము ఉండాలని అన్నారు.

సంకల్పంతో తన సొంత నిధులతో ఒక ఎకరం స్థలంలో నేలకల్ రోడ్ లో కళ్యాణమండపం విరాళంగా ఇవ్వడం జరిగిందన్నారు. ఎందుకు దాతల సహకారం కూడా తీసుకొని నిర్మాణం పూర్తి చేయడం జరిగిందన్నారు. అలాగే బీద ఆర్యవైశ్య ఉత్తమ విద్యార్థుల ఉన్నత చదువులు ఆర్థిక లోటు పరంగా మధ్యలో ఆగిపోకూడదని తెలిపారు. సంకల్పంతో తాను చైర్మన్గా ఉంటూ మరికొంతమంది ట్రస్ట్ లీడర్ సహకారంతో శ్రీ వాసవి సేవా సమితి ఏర్పాటు చేసి ట్రస్ట్ ఈ ఆధ్వర్యంలో సుమారు రూ.5 లక్షల వరకు స్కాలర్షిప్ ఇవ్వడం జరిగిందన్నారు.

అలాగే 2023 2024 సంవత్సరంనకు కాను జిల్లా ఆర్యవైశ్య మహాసభకు అధ్యక్షులుగా సేవలందించి జిల్లాలో ఉన్న అన్ని మండలాల్లోని ఆర్యవైశ్య సంఘాలను ఏకతాటిపైకి తెచ్చి ఆర్యవైశ్యలను రాజకీయంగా రాణించాలని ఆకాంక్షించారు. ప్రభుత్వ కార్యదర్శిలను మరియు వారి కార్యవర్గంను చైతన్యవంతులను చేశామన్నారు. తనకు మరొకసారి ఆర్యవైశ్య సంఘం పట్టణ అధ్యక్షుడిగా ఆర్య వైశ్యులు అవకాశం కల్పించి ఆర్యవైశ్యుల అభివృద్ధికి దోహదపడాలని ఆయన అన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img