Sunday, July 13, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్సికిల్‌ సెల్‌ ఎనీమియా నిర్మూలన కృషి: రాజ్ కుమార్ 

సికిల్‌ సెల్‌ ఎనీమియా నిర్మూలన కృషి: రాజ్ కుమార్ 

- Advertisement -

నవతెలంగాణ – పెద్దవంగర: సికిల్ సెల్ ఎనీమియా వ్యాధి నిర్మూలనకు కృషి చేస్తామని వడ్డెకొత్తపల్లి పల్లె దావఖాన వైద్యాధికారి రాజ్ కుమార్ అన్నారు. గురువారం మండలంలోని పోచారం గ్రామంలో సికిల్‌ సెల్‌ ఎనీమియా వ్యాధి నిర్మూలన దినోత్సవాన్ని పురస్కరించుకుని విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఎర్ర రక్తకణాల లోపంతో ఉన్న తల్లిదండ్రుల నుంచి చిన్నారులకు ఈ వ్యాధి సంక్రమిస్తుందన్నారు. పలు జన్యుపరమైన లోపాలకు మాదిరిగానే ఈ వ్యాధికి మందు లేదని తెలిపారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, వైద్య సిబ్బంది, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -