Wednesday, November 26, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంమత్స్యకారుల జీవన ప్రమాణాల పెంపునకు కృషి

మత్స్యకారుల జీవన ప్రమాణాల పెంపునకు కృషి

- Advertisement -

– స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్‌
– నంది వాగు ప్రాజెక్టులో చేప పిల్లల విడుదల
– మోమిన్‌పేటలో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు
నవతెలంగాణ-మోమిన్‌పేట్‌

మత్స్యకారుల జీవన ప్రమాణాలు మెరుగుపరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని, అందులో భాగంగానే పెద్ద మొత్తంలో చేప పిల్లల పంపిణీ చేస్తోందని స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్‌ అన్నారు. మంగళవారం వికారాబాద్‌ జిల్లా మోమిన్‌పేట్‌ మండలం నందివాగు చెరువులో స్పీకర్‌ చేప పిల్లలను విడుదల చేశారు. అలాగే మండల కేంద్రంలోని రైతు వేదికలో 48 మంది లబ్దిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ చెక్కుల పంపిణీతోపాటు దేవరంపల్లి, చక్రంపల్లి గ్రామాల్లో రూ.3 కోట్లతో చేపట్టిన వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన, ప్రారంభోత్సవలు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో స్పీకర్‌ మాట్లాడారు. మత్స్యకారుల కుటుంబాలు కులవృత్తిని నమ్ముకొని జీవనం సాగిస్తున్నారన్నారు. గత ప్రభుత్వాలు మత్స్యకారులను సరిగ్గా పట్టించుకోలేదని, చెరువుల్లో ఎన్ని చేపలను వదిలారో కూడా లెక్కలు లేవని తెలిపారు. జిల్లాలో కోటి 29 లక్షల చేప పిల్లలను వదిలేందుకు ప్రభుత్వం నుంచి అనుమతులు వచ్చినట్టు చెప్పారు. నందివాగు చెరువులో లక్షా 92 వేల చేప పిల్లలను వదిలినట్టు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకిచ్చిన ఆరు గ్యారంటీలతోపాటు ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేరుస్తోందన్నారు. అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తోందని తెలిపారు. ప్రతి ఆడపడుచును గౌరవించుకునే విధంగా నాణ్యమైన చీరలను అందిస్తోందన్నారు. రహదారులకు ప్రాధాన్యత కల్పిస్తూ రోడ్ల నిర్మాణానికి ఆర్‌అండ్‌బీ ద్వారా రూ.554 కోట్లు, పంచాయతీరాజ్‌ ద్వారా రూ.160 కోట్లు మంజూరు చేసి పనులు ప్రారంభించినట్టు వివరించారు. మత్స్యకార అభివృద్ధి సంస్థ చైర్మెన్‌ మెట్టు సాయికుమార్‌ మాట్లాడుతూ.. మహిళా మత్స్యకారులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందన్నారు. ప్రతి మత్స్య సహకార సంఘంలోనూ 100మంది సభ్యత్వం కలిగి ఉండాలని సూచించారు. సభ్యులు అకాల మరణం చెందితే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రూ.7 లక్షల నష్టపరిహారం అందిస్తున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా పశుసంవర్ధక అధికారి, మండల ప్రత్యేక అధికారి సదానందం, బీసీ సంక్షేమ అధికారి మాధవరెడ్డి, మత్స్య శాఖ అధికారి రంగనాయక్‌, తహసీల్దార్‌ రవీందర్‌, ఎంపీడీఓ సృజన సాహిత్య, వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్మెన్‌ మహేందర్‌రెడ్డి, కాంగ్రెస్‌ మండల అధ్యక్షులు శంకర్‌యాదవ్‌, నందివాగు చెరువు చైర్మెన్‌ రాజు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -