జనసేన పార్టీ నియోజకవర్గ నాయకులు ప్రశాంత్ రెడ్డి
ఘనంగా పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు
నవతెలంగాణ – పాలకుర్తి
తెలంగాణలో జనసేన పార్టీ పటిష్టతకు ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కృషి చేస్తున్నారని జనసేన పార్టీ నియోజకవర్గ నాయకులు మేడిద ప్రశాంత్ రెడ్డి అన్నారు. ఏపీ ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలను పురస్కరించుకుని మండల కేంద్రంలో గల బీసీ బాలుర వసతి గృహంలో కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం బీసీ బాలుర వసతి గృహ విద్యార్థులకు దోమతెరలను అందించారు. ఈ సందర్భంగా ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ యువతకు పవన్ కళ్యాణ్ ఆదర్శమన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు ఆకుల సైదులు, మాడరాజు అశోక్, బండి ప్రశాంత్, భూక్య బాలునాయక్, కళ్యాణ్,పూజారి సాయికిరణ్, మారోజు సాయి, వడ్లకొండ శ్రావణ్, సోమ సాయి, గుండె మనోజ్, మహేష్ తదుపరిలు పాల్గొన్నారు.
జనసేన పార్టీ పటిష్టతకు కృషి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES