Friday, August 29, 2025
E-PAPER
spot_img
Homeరాష్ట్రీయంరవాణాశాఖ బలోపేతానికి కృషి

రవాణాశాఖ బలోపేతానికి కృషి

- Advertisement -

– పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఈవీ వాహనాల పెంపు : మంత్రి పొన్నం ప్రభాకర్‌
– పంజాగుట్ట నుంచి హైదరాబాద్‌ కలెక్టరేట్‌ వరకు ఆర్టీసీ బస్సులో ప్రయాణం
నవతెలంగాణ-బంజారాహిల్స్‌

ప్రభుత్వం రవాణాశాఖ బలోపేతానికి కృషి చేస్తోందని, పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఈవీ వాహనాల సంఖ్య పెంచుతు న్నామని మంత్రి పొన్నం ప్రభాకర్‌ తెలి పారు. జీహెచ్‌ఎంసీ మేయర్‌ గద్వాల్‌ విజయలక్ష్మీ, రాజ్యసభ సభ్యులు అనిల్‌ కుమార్‌ యాదవ్‌తో కలిసి ఆయన శని వారం పంజాగుట్ట నుంచి లక్డికాపూల్‌లోని హైదరాబాద్‌ కలెక్టరేట్‌ వరకు ఆర్టీసీ బస్సులో టికెట్‌ తీసుకొని ప్రయాణం చేశారు. ఈ సందర్భంగా మహిళా ప్రయాణి కులతో మాట్లాడారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఈవీ వాహనాల సంఖ్య పెంచామని, బస్సులో సౌకర్యాలు ఎలా ఉన్నాయని అడిగి తెలుసుకున్నారు. ఉచిత బస్సు ప్రయాణంతో ప్రతి రోజూ ఉద్యోగాలు చేసే మహిళలతోపాటు ఇతర అవసరాల నిమిత్తం రాష్ట్రంలో ఎక్కడికి వెళ్లాలన్నా ఇబ్బంది లేదని వారు మంత్రికి తెలిపారు. తమకు నెల వారీగా కొంత డబ్బు ఆదా అవుతుందని మహిళలు సంతోషం వ్యక్తం చేశారు. అనంతరం మంత్రి పొన్నం మాట్లాడుతూ.. నగరంలో పెద్ద సంఖ్యలో ఆర్టీసీ బస్సులు వచ్చాయని తెలిపారు. ప్రయాణికులకు ఎక్కడా ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం అన్ని చర్యలూ తీసుకుంటోందని తెలిపారు. ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలు పరిష్కారం చేస్తున్నామన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad