Friday, August 8, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్పరకాలలో ఈజీఎస్ పనులు బేస్ 

పరకాలలో ఈజీఎస్ పనులు బేస్ 

- Advertisement -

 ఏపీ డి శ్రీనివాసరావు 
నవతెలంగాణ -పరకాల
: పరకాల మండలంలో ఈజీఎస్ పనులు బెస్ అంటూ ప్రిసైడింగ్ అధికారి ఏపీడి శ్రీనివాసరావు కొనియాడారు. మంగళవారం పరకాలలో 16వ విడత సామాజిక తనిఖీ ప్రజా వేదిక కార్యక్రమం ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమానికి ప్రిసైడింగ్ అధికారి ఏ.పీ.డి శ్రీనివాసరావు, జిల్లా విజిలెన్స్ అధికారి నరసింహారెడ్డి మండల స్పెషల్ ఆఫీసర్ విజయభాస్కర్,ఎంపీఓ విమల. ఏపిఓ ఇందిర,సోషల్ ఆడిట్ ఎస్ఆర్పి స్వామి పాల్గొన్నారు. అనంతరం 10 గ్రామాలలో పది రోజులుగా ఉపాధి హామీ పనులపై సామాజిక తనిఖీ బృందం తనిఖీలు నిర్వహించి నివేదిక తయారు చేసి అధికారుల ముందు చదివి వినిపించడం జరిగింది.

10 గ్రామాలలో ఎలాంటి అవకతవకలు జరగకపోవడంతో జిల్లా అధికారులు ఎంపీడీవో ను ఏపీఓను,ఉపాధి హామీ సిబ్బందిని అభినందించారు. అనంతరం ఏపీడి శ్రీనివాసరావు మాట్లాడుతూ ఉపాధి హామీ పనులలో ఎలాంటి అవకతవకలు జరిగిన పూర్తి బాధ్యత పంచాయతీ కార్యదర్శులు వహించవలసి ఉంటుందని ఫీల్డ్ అసిస్టెంట్లు కూడా జాగ్రత్తగా పనులు చేపించాలని ఎలాంటి అవకతవకులకు పాల్పడకూడదని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్ ఏఈ శ్రీలత ,ఈసీ రజినీకాంత్ మరియు సోషల్ ఆడిట్ డిఆర్పిలు పంచాయతీ కార్యదర్శులు ఫీల్డ్ అసిస్టెంట్లు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img