Saturday, November 1, 2025
E-PAPER
Homeజిల్లాలుఉక్కు మనిషికి ఏక్తా దివాస్ సలాం

ఉక్కు మనిషికి ఏక్తా దివాస్ సలాం

- Advertisement -

పోలీసుల కవాత్ ను ప్రారంభించిన డీసీపీ సునీతా రెడ్డి నవతెలంగాణ ఇబ్రహీంపట్నం 

నవతెలంగాణ ఇబ్రహీంపట్నం: భారతదేశ ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతిని పురస్కరించుకుని ఇబ్రహీంపట్నంలో పోలీసులు కవాత్ నిర్వహించారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ కు సమాచార సలాం కొట్టారు. ఈ ర్యాలీని మహేశ్వరం డీసీపీ సునీతా రెడ్డి ప్రారంభించారు. కవాత్ లో పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం అక్టోబర్ 31న రాష్ట్రీయ ఏక్తా దివాస్ జరుపుకుంటారు. రాష్ట్రీయ ఏక్తా దివాస్ భారతదేశ ఐక్యత, సమగ్రత, జాతీయ సంఘీభావాన్ని సూచిస్తుంది.

ఈ సంవత్సరం రాష్ట్రీయ ఏక్తా దివస్ వేడుక సర్దార్ పటేల్ 150వ జయంతిని పురస్కరించుకుని ప్రత్యేకంగా నిర్వహించారు. అందులో భాగంగానే ఇబ్రహీంపట్నంలో స్థానిక పోలీసులు ఈ ఏక్తా దివాస్ నిర్వహించారు. ఈ సందర్భంగా డీసీపీ సునితా రెడ్డి మాట్లాడుతూ… సర్దార్ పటేల్ జయంతిని జాతీయ సమైక్యతా దినోత్సవంగా పాటించడం జరుగుతుందన్నారు. 

భిన్నత్వంలో ఏకత్వం అనే సందేశాన్ని సూచిస్తుందన్నారు. జాతీయ ఏకతా దివాస్ సందర్భంగా నిర్వహిస్తున్న కార్యక్రమాలు జాతీయ ఐక్యత, సామరస్యం, దేశభక్తి స్ఫూర్తిని నింపుతున్నాయన్నారు.  దేశ ప్రజల మధ్య ఐక్యత, శాంతి,  సోదరభావాన్ని ప్రోత్సహించడం లక్ష్యంగా పెట్టుకుందన్నారు.  భారతదేశాన్ని ఏకీకృతం చేయడంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ చేసిన కృషి అమోగమన్నారు. ఈ కార్యక్రమంలో ఇబ్రహీంపట్నం ఏసీపీ కేపీవీ రాజు, సీఐ మహేందర్ రెడ్డి, ఎస్ఐ రామకృష్ణ, నాగరాజు, సూర్య, చందర్ సింగ్, సుమలత, పోలీసు సిబ్బంది ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -