నిమజ్జన కేంద్రాలను సందర్శించిన కలెక్టర్
నవతెలంగాణ – వనపర్తి
వినాయకుడి నవరాత్రి ఉత్సవాలు సందర్భంగా జిల్లాలో కొలువుదీరిన గణనాథులను నిమజ్జనం చేసేందుకు అధికారులు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. ఈ నెల 5, 6 తేదీలలో నల్ల చెరువు, అమ్మ చెరువులను వినాయక నిమజ్జనం కోసం అధికారులు కట్టదుట్టమైన ఏర్పాట్లు చేశారు. బుధవారం నల్లచెరువు పరిసరాలలో కట్టుదిట్టమైన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి పరిశీలించారు. వనపర్తి పట్టణం, వనపర్తి మండలంలో 450 విగ్రహాలు ఉన్నట్లు టౌన్ ఎస్ఐ హరిప్రసాద్ తెలిపారు.
ఏర్పాట్ల తీరుపై మున్సిపాలిటీ డిఈ మహమ్మద్ యూసఫ్ ను అడిగి తెలుసుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనను చోటుచేసుకోకుండా అధికారులను అప్రమత్తం చేయాలని సూచించారు. చెరువులో ప్రమాద స్థలలు ఎక్కడెక్కడ ఉన్నాయని అడిగి తెలుసుకున్నారు. నిమజ్జన కార్యక్రమానికి కావలసిన సదుపాయాలు అన్నింటిని ఏర్పాటు చేయాలన్నారు. ముందస్తుగా సహాయక చర్యలు చేపట్టే వారికి కావలసిన సేఫ్టీ పరికరాలను సమకూర్చలన్నారు. కలెక్టర్ వెంట మున్సిపల్ డిఈ మహమ్మద్ యూసఫ్, ఏఈలు, మున్సిపల్ సానిటేషన్ ఇంచార్జ్ స్పెక్టర్ ఉమామహేశ్వర్ రెడ్డి, పలువురు ఉన్నారు.