నవతెలంగాణ ఆర్మూర్
చలి తీవ్రత రోజుకు పెరుగుతోందని పౌష్టికాహారం, గోరువెచ్చని నీరు తీసుకోవాలని నిత్య ఈఎన్టీ సర్జన్ డాక్టర్ చైతన్య అన్నారు. ముఖ్యంగా చెవి ముక్కు గొంతు తదితర సమస్యలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని పట్టణానికి చెందిన డాక్టర్ చైతన్య ఆదివారం తెలిపారు.
అలర్జీలా సమస్య ఉన్నవారిలో ముక్కులోని మ్యూకస్ పొరల్లో ఇన్నోవేషన్ కారణంగా వాపు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ముక్కు ద్వారా గాలి సాఫీగా లోపలికి వెళ్లే ప్రక్రియలో కొంత అడ్డంకులు ఏర్పడతాయని అన్నారు. ఈ అడ్డంకుల కారణంగానే ముక్కుదిబ్బడ వస్తుందని, గాలిని బలంగా పీల్చడం లేదా నోటితో గాలి పీల్చాల్సి వస్తుందని తెలిపారు.
ఈ సమస్య పరిష్కారానికి ఈఎన్టీ వైద్యులను సంప్రదించాలని, తమ హాస్పిటల్ లో అత్యధికమైన పరికరాల ద్వారా చెవి, ముక్కు, గొంతు వ్యాధుల నిర్ధారణ చేసి, ఎండోస్కోపీ, మైక్రోస్కోపీ, మైక్రో డి బ్రీడర్ ద్వారా ఆపరేషన్లు చేస్తున్నట్టు తెలిపారు.



