Monday, August 11, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న వృద్దుడు

ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న వృద్దుడు

- Advertisement -

 నవతెలంగాణ – ఆత్మకూరు: గుర్తుతెలియని వృద్ధుడు ఉరివేసుకొని ఆత్మహత్య పాల్పడిన సంఘటన మండలంలోని గుడెపాడ్ లో చోటుచేసుకుంది. స్థానిక సీఐ ఆర్ సంతోష్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని గూడెపాడ్ గ్రామపంచాయతీ పరిధిలో గుర్తు తెలియని వృద్దుడు గూడెపాడు జాతీయ రహదారిపై వ్యవసాయ భూమిలో వేప చెట్టుకు గుర్తుతెలియని వ్యక్తి ఉరివేసుకొని మృతి చెందారు. ఆ వ్యక్తికి వయసు సుమారు 70 నుండి 80 ఏండ్లు ఉండొచ్చని పోలీసులు అంచనా వేశారు. నీలిరంగు, తెలుపు గీతల ఆఫ్ షర్టు, ఆకుపచ్చ రంగు గల గీతల గల్ల లుంగి ఉండి, పసుపు రంగు నైలాన్ తాడుతో ఉరివేసుకుని ఉన్నారు. మృతిని ఎడమ కన్ను బొమ్మ దగ్గర పులిపిరి ఉన్నది. వ్యక్తి మరణంపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు సీఐ తెలిపారు. ఈ మృతుని ని గుర్తుపట్టిన వారు ఆత్మకూర్ పోలీస్ స్టేషన్ 8712685225 , 8712685252 లకు సమాచారం ఇవ్వవలసిందిగా సిఐ కోరారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img