Sunday, October 19, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్చికిత్స పొందుతూ వృద్దుడు మృతి..

చికిత్స పొందుతూ వృద్దుడు మృతి..

- Advertisement -

నవతెలంగాణ -పెద్దవంగర: చికిత్స పొందుతూ ఓ వృద్దుడు మృతి చెందిన ఘటన మండల పరిధిలో శనివారం చోటుచేసుకుంది. ఏఎస్సై ఎండీ హిదాయత్ అలీ తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని చిన్నవంగర గ్రామానికి చెందిన కూన నారాయణ (65) గ్రామంలో తనకున్న కొద్దిపాటి పొలం సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. కుటుంబ అవసరాల నిమిత్తం తన భూమిని అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తికి విక్రయించాడు.‌ భూమికి సంబంధించి రిజిస్ట్రేషన్ విషయంలో వివాదం తలెత్తింది.‌ పలుమార్లు పంచాయతీ నిర్వహించినా పరిష్కారం కాలేదు. దీంతో అప్పుల బాధతో తీవ్ర మనస్థాపానికి గురైన నారాయణ శుక్రవారం తెల్లవారుజామున ఇంట్లో ఎవరు లేని సమయంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే తొర్రూరు లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.‌ పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం నిమిత్తం ఎంజీఎం కు తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ శనివారం మృతిచెందారు.‌ మృతుడి బార్య కూన శశిరేఖ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్సై తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని వర్ధన్నపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు.‌ మృతుడికి కుమార్తె శారద, కుమారుడు సతీష్ ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -