Friday, December 12, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంఎన్నికలు బహిష్కరణ

ఎన్నికలు బహిష్కరణ

- Advertisement -

– రెండు తండాల మధ్య విభేదాలు
– ఎస్పీ, ఆర్డీవో సూచించినా ఓటేయని ఓటర్లు
– కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం గోకుల్‌తండా పరిధిలోని పెద్దతండా, చిన్నతండాల మధ్య ఘర్షణ
నవతెలంగాణ-రామారెడ్డి

తండాల మధ్య విభేదాలు.. ఎన్నికల బహిష్కరణకు దారి తీసింది. కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం గోకుల్‌ తండా గ్రామపంచాయతీ పరిధిలోని పెద్ద తండా, చిన్న తండా మధ్య ఘర్షణ.. ఎన్నికల బహిష్కరణకు దారితీసింది. పెద్ద తండా పరిధిలో 410, చిన్న తండా పరిధిలో 255 ఓటర్లున్నారు. గిద్ద ఎంపీటీసీ పరిధిలో గిద్ద, రాధాయిపల్లితోపాటు గోకుల్‌తండా గ్రామపంచాయతీ ఉంది. గత ఎంపీటీసీ ఎన్నికల్లో ఓ అభ్యర్థి చిన్నతండాకు రూ.2.50 లక్షలు ఇచ్చారని పెద్దతండా ప్రజలు ఆరోపిస్తున్నారు. అయితే పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్‌ అభ్యర్థి పెద్దతండాకు ఏకగ్రీవం కోసం రూ.13.40 లక్షలు ఇచ్చినట్టు చిన్నతండా వాసులు ఆరోపిస్తున్నారు. డబ్బుల విషయంలో రెండు తండాల మధ్య విభేదాలు రావడంతో, చిన్న తండా పరిధిలోని 1,2,3 వార్డుల్లో ఒక్కొక్క అభ్యర్థి పోటీచేసేందుకు నామినేషన్‌ వేసి ఉపసంహరించుకోవడంతో గురువారం ఎన్నికలు జరగలేదు. సర్పంచ్‌ పదవికి పెద్ద తండా నుంచి ఒకరు, చిన్న తండా నుంచి ఇద్దరు పోటీచేసి చిన్న తండా ప్రజలు ఎన్నికలకు దూరంగా ఉన్నారు. ఎస్పీ రాజేష్‌చంద్ర, ఆర్డీఓ వీణ సందర్శించి చిన్న తండా ఓటర్లకు అవగాహన కల్పించారు. నచ్చిన నాయకుడికి ఓటు వేయాలని, ఎవరూ నచ్చకుంటే నోటాకు అవకాశం ఉందని సూచించారు. అయినా చిన్న తండా ప్రజలు.. పెద్ద తండాకు వెళ్లే ప్రసక్తే లేదని, చిన్న తండాలో పోలింగ్‌ బూత్‌ ఏర్పాటు చేస్తే ఓటు హక్కును వినియోగించుకుంటామని తెగేసి చెప్పడంతో అధికారులు వెనుదిరిగారు. చిన్నతండాలోని ఒకరిద్దరు తప్పా ఎక్కువమంది ఓటు హక్కు వినియోగించుకోలేదు. అనంతరం ఎస్పీ రామారెడ్డి, ఏఎస్పీ చైతన్యరెడ్డి.. అన్నారం, రెడ్డిపేట్‌, రామారెడ్డి పోలింగ్‌ కేంద్రాలను సందర్శించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -