Friday, December 5, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్రోడ్డు సౌకర్యం కల్పించాలని ఎన్నికల బహిష్కరణ..

రోడ్డు సౌకర్యం కల్పించాలని ఎన్నికల బహిష్కరణ..

- Advertisement -

పాలకులు మారినా రోడ్డు సౌకర్యం కల్పించడం లేదని బుగ్గ కాలువ తండా ఓటర్ల నిరసన..
నవతెలంగాణ – వెల్దండ
వెల్దండ మండల పరిధిలోని చెదురపల్లి గ్రామపంచాయతీ బుగ్గ కాలువ తండాకు రోడ్డు సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేస్తూ రోడ్డు సౌకర్యం కల్పించే వరకు ఎన్నికలలో పాల్గొనమంటూ శుక్రవారం గ్రామ యువకులు ఎన్నికల బహిష్కరణ  చేస్తున్నామంటూ బ్యానర్ ప్రదర్శించారు. రోడ్డు సౌకర్యం కల్పించే వరకు ఎన్నికలలో పాల్గొనమని అంటూ జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ కుమార్ , ఎంపీడీవో  సత్యపాల్ రెడ్డి,  గ్రామపంచాయతీ లకు కార్యదర్శులకు వినతి పత్రాలు అందజేశారు. అనంతరం స్థానిక గ్రామపంచాయతీ కార్యాలయం ఎదుట ఎన్నికల బహిష్కరణ పేరుతో బ్యానర్లు ప్రదర్శిస్తూ ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తండా యువకులు , గ్రామస్తులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -