Saturday, December 6, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంరోడ్డు సౌకర్యం కల్పించాలని ఎన్నికల బహిష్కరణ

రోడ్డు సౌకర్యం కల్పించాలని ఎన్నికల బహిష్కరణ

- Advertisement -

బుగ్గకాలువ తండావాసుల నిరసన

నవతెలంగాణ-వెల్దండ
రోడ్డు సౌకర్యం కల్పించాలని బుగ్గ కాలువ తండా వాసులు నిరసన వ్యక్తం చేశారు. నాగర్‌కర్నూల్‌ జిల్లా వెల్దండ మండల పరిధిలోని చెదురపల్లి గ్రామపంచాయతీ బుగ్గ కాలువ తండాకు రోడ్డు సౌకర్యం కల్పించే వరకు ఎన్నికల్లో పాల్గొనబోమంటూ శుక్రవారం గ్రామ యువకులు బ్యానర్‌ పట్టుకుని నిరసన తెలిపారు. రోడ్డు, డ్రైనేజీ, నీటి సమస్య పరిష్కారం, వీధి దీపాలు, బస్సు సౌకర్యం కల్పించాలంటూ జిల్లా కలెక్టర్‌ బాదావత్‌ సంతోష్‌ కుమార్‌, ఎంపీడీవో సత్యపాల్‌ రెడ్డి, గ్రామపంచాయతీ కార్యదర్శికి వినతి పత్రాలు అందజేశారు. అనంతరం గ్రామ పంచాయతీ కార్యాలయం ఎదుట ఎన్నికల బహిష్కరణ పేరుతో బ్యానర్లు ప్రదర్శిస్తూ ధర్నా నిర్వహించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -