నవతెలంగాణ-హైదరాబాద్: ఆగస్టు 5న ఢిల్లీలోని నిర్వచన్ సాధన్ ప్రధాన కార్యాలయంలో దేశంలోని రాజకీయ పార్టీలతో ఈసీ సమావేశం కానుంది. ఈక్రమంలో బీఆర్ఎస్ ప్రతినిధి బృందాన్ని భారత ఎన్నికల కమిషన్ ఆహ్వానించించింది. ఈ మేరకు బీఆర్ఎస్ పార్టీకి, ఈసీఐ కార్యదర్శి అశ్విని కుమార్ మొహాల్ అధికారిక ఆహ్వాన లేఖ పంపారు. ఈ ఆహ్వానాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ద్వారా బీఆర్ఎస్ అధ్యక్షుడికి కూడా పంపారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ నేతృత్వంలో పార్టీ కీలక నాయకులు, మాజీ పార్లమెంట్ సభ్యులు ఈ సమావేశానికి హాజరు కానున్నారు.
ఈ సమావేశంలో ఎన్నికల సంస్కరణలు, ఇప్పటికే ఈసీఐకి సమర్పించిన వివిధ అభ్యర్థనలు, ఎన్నికల ప్రవర్తనా నియమావళి సంబంధిత అంశాలపై చర్చ జరిగే అవకాశముంది. పలు రాష్ట్రాల్లో జరుగుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఈ సమావేశం ప్రాధాన్యతను సంతరించుకుంది.