నవతెలంగాణ-హైదరాబాద్: ఎస్‌ఐఆర్‌పై లోక్‌సభలో వాడీవేడీ చర్చ జరుగుతోంది. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆర్‌ఎస్‌ఎస్ అనేది ఎన్నికల వ్యవస్థతో పాటు సీబీఐ, ఈడీ సంస్థలను ప్రభుత్వం తన గుప్పిట్లో పెట్టుకుందన్నారు. సీబీఐ చీఫ్‌ను సీజేఐ ఎందుకు ప్రతిపాదించడం లేదని అడిగారు. కేంద్రం విద్యా వ్యవస్థను పూర్తిగా మార్చేసిందని మెరిట్‌తో సంబంధం లేకుండా యూనివర్సిటీలకు వీసీలను నియమిస్తున్నారని ప్రశ్నించారు.
ఎలక్షన్ కమిషనర్‌లకు ఇంత పెద్ద గిప్ట్ ఏ ప్రధాని, హోంమంత్రి ఇవ్వలేదన్నారు. 45 రోజుల్లో సీసీటీవీ పుటేజ్ ధ్వంసం చేసే నిబంధన ఎందుకని?.. ఇది డేటా సంరక్షణ కాదు డేటా చోరీ అని రాహుల్ విమర్శించారు.ఉత్తరప్రదేశ్, హర్యానాలో ఓటు చోరి జరిగిందన్నారు. ఫేక్ ఓట్లపై ఎలక్షన్ కమిషన్ ఇంత వరకూ క్లారిటీ ఇవ్వలేదని తెలిపారు. ఆర్ఎస్ఎస్‌కు వ్యతిరేకంగా వ్యవహరించేవారిని ప్రభుత్వం టార్టెట్ చేస్తోందని రాహుల్ ఆరోపించారు. ఆర్ఎస్ఎస్ అన్ని వ్యవస్థలను తన గుప్పెట్లో ఉంచడానికి ప్రయత్నిస్తుందని రాహుల్ అన్నారు. ఎన్నికల వ్యవస్థ ఆర్ఎస్ఎస్ చేతుల్లో ఉందని విమర్శించారు.


