నవతెలంగాణ-హైదరాబాద్: త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా మైనార్టీ, దళితుల ఓట్లు తొలగింపే లక్ష్యంగా వ్యవస్థలు పని చేస్తున్నాయని కాంగ్రెస్ అధ్యక్షులు మల్లిఖార్జున ఖర్గే అన్నారు. ఇది ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఓ ట్రేండ్ గా మారిందని మండిపడ్డారు.
ఢిల్లీలో జరుగుతున్న AICC లీగల్ కాన్క్లేవ్ సదస్సులో ఆయన పాల్గొన్ని మాట్లాడారు. ఓటర్ల జాబితా నుండి పేర్లను సామూహికంగా తొలగించడం ద్వారా ముఖ్యంగా పేదలు, దళితులు, వెనుకబడిన వర్గాలు, మైనారిటీలు వారి ఓటు హక్కును క్రమంగా కోల్పోతున్నారని ఆరోపించారు.ఈ విధంగా లక్షల మంది పేర్లను ఓటర్ల జాబితా నుంచి తొలగిస్తున్నారని విమర్శించారు. ఈ ప్రక్రియను తామంత వెంటనే కట్టడి చేయలని ఆయన పిలుపునిచ్చారు. ఈచర్యతో రాజ్యాంగం కల్పించిన హక్కును కోల్పోతున్నారని, వాటిని రక్షించే బాధ్యత ప్రభుత్వంపై ఈసీపై ఉందని ఆయన గుర్తు చేశారు.
“రాజ్యాంగ హక్కుల హరించుకుపోవడానికి ప్రభుత్వం, ఎన్నికల సంఘం బాధ్యత వహిస్తాయి. సుప్రీంకోర్టు ఈ విషయం యొక్క తీవ్రతను గుర్తించింది, కానీ అనేక విచారణలు జరిగినప్పటికీ, ఎన్నికల సంఘం తన ప్రవర్తనను మార్చుకోలేదు” అని ఖర్గే అన్నారు.
ఎన్నికల కమిషన్ తన స్వయంప్రతిపత్తిని కోల్పోయిందని ఆయన ఆరోపించారు. అత్యున్నత ఎన్నికల సంస్థను ప్రధాని మోడీ కీలుబొమ్మగా అభివర్ణించారు. “బీహార్‌లో 65 లక్షల లేదా 1 కోటి మంది ఓటర్లకు ఓటు హక్కును నిరాకరించడం దళితులు, వెనుకబడిన వర్గాలను పాల్గొనకుండా మినహాయించడానికి ఉద్దేశపూర్వక కుట్ర అని ఆయన అన్నారు.