Saturday, August 2, 2025
E-PAPER
Homeజాతీయంభారత్ ఎన్నికల కమిషన్ నిజంగా చచ్చిపోయింది: రాహుల్ గాంధీ

భారత్ ఎన్నికల కమిషన్ నిజంగా చచ్చిపోయింది: రాహుల్ గాంధీ

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: దేశ రాజధాని ఢిల్లీలోని విజ్ఞాన భవన్‌లో ఇవాళ జరుగుతున్న కాంగ్రెస్ న్యాయ సదస్సులో ప్ర‌తిప‌క్ష నేత రాహుల్ గాంధీ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. భారత్‌లో ఎన్నికల కమిషన్ నిజంగా చచ్చిపోయిందని రాహుల్ గాంధీ తీవ్రంగా మండిపడ్డారు. లోక్ సభ ఎన్నికల్లో పీఎం ఇన్ని సీట్లు గెలవలేర‌ని, త‌మ‌ దగ్గర ఆధారాలు ఉన్నాయ‌న్నారు. కాబట్టే ఇపుడు మాట్లాడుతున్నాం.. ఎలా పోరాడాలో త‌మ‌కు తెలుసు.. రాజకీయ నాయకులుగా పోరాటం చేస్తున్నామ‌న్నారు.

బీజేపీ వరుస విజయాల వెనుక చీటింగ్ జరుగుతోంది.. ఇపుడు మన వద్ద ఆధారాలు ఉన్నాయి.. మహారాష్ట్ర లోక్ సభ ఎన్నికల్లో మేం గెలిచాం.. అసెంబ్లీలో మేం ఓడాం.. ఎన్నికల కమిషన్ కాపీలు స్కాన్ ప్రొటెక్ట్ తో రూపొందించారు.. ఓటర్ల జాబితాలో అక్రమాలు జరుగుతున్నాయని రాహుల్ గాంధీ ఆరోపించారు.

న్యాయవాదులు కోర్టుల్లో పోరాడాలని సూచించారు. పీఎం ఆఫీస్ రఫెల్ బీ విషయంలో ఇచ్చిన డాక్యుమెంట్ స్పష్టంగా ఉంది.. ఏ దేశంలో ఇలా జరగదు.. నాపై కేసులు పెట్టారు, 30 కేసుల్లో పోరాడుతున్నాను.. రైతుల కోసం పోరాడితే.. నన్ను బెదిరించారు అని ఆయన గుర్తు చేశారు. కాంగ్రెస్ ఎవరికి భయపడదు.. దేశం మా రక్తం.. రాజ్యాంగంపై అన్ని రకాలుగా దాడి చేస్తున్నారు.. రాజ్యాంగం పరిధిలోకి దేశంలోని అన్ని వర్గాలు వస్తాయి.. చరిత్రపై, చట్టాలపై, రాజ్యాంగంపై దాడి చేయడం దారుణమన్నారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -