- సబ్ కలెక్టరేట్‌లో అంగన్వాడీ టీచర్లు వినతి
నవతెలంగాణ-మిర్యాలగూడ: గ్రామపంచాయతీ ఎన్నికల విధుల భత్యం చెల్లించాలని కోరుతూ బూత్ లెవెల్ ఆఫీసర్లయిన అంగన్వాడీ టీచర్లు కోరారు. సబ్ కలెక్టరేట్‌లో ఎస్ఐఆర్ విధులు నిర్వహిస్తున్న అంగన్వాడీ టీచర్లు మిర్యాలగూడ సబ్ కలెక్టర్ ఎం. నారాయణ్ అమిత్‌కు సోమవారం సాయంత్రం వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గ్రామపంచాయతీ ఎన్నికల సందర్బంగా డిసెంబర్ 12 నుండి 14 వరకు ఆయా గ్రామాల్లో పోల్ స్లీపుల పంపిణి, ఎన్నికల తదితర విధులు నిర్వహించామన్నారు. 2024లో కుల గణన సర్వే నిర్వహించామని, వాటికీ పారితోషికం ఇవ్వలేదని వాపోయారు. చేసిన విధులకు వెంటనే భత్యం ఇప్పించేలా అధికారులను ఆదేశించాలని స్థానిక ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి బిఎల్ఆర్ కోరనున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్స్ హెల్పర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి బొందు పార్వతి, కార్యవర్గ సభ్యులు ఇంద్రపల్లి సైదమ్మ, టీచర్లు నాగమణి, రాణి, ప్రమీల, పద్మ పాల్గొన్నారు.



