Tuesday, December 2, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంనూతన కమిటీ ఎన్నిక

నూతన కమిటీ ఎన్నిక

- Advertisement -

అధ్యక్ష ప్రధాన కార్యదర్శులుగా మహమ్మద్‌ బషీర్‌ అహ్మద్‌, ఆరూరి కుమార్‌
నవతెలంగాణ-వరంగల్‌

వరంగల్‌ జిల్లా ఉర్సుగుట్ట సమీపంలోని రామ సురేందర్‌ భవన్‌లో సోమవారం సీఐటీయూ వరంగల్‌ జిల్లా 10వ మహాసభ నిర్వహించారు. అధ్యక్షవర్గంగా ఎండి బషీర్‌, బోళ్ల కుమురయ్య, కోమల వ్యవహరించగా.. సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్‌, రాష్ట్ర ఉపాధ్యక్షులు కూరపాటి రమేష్‌, రాష్ట్ర కార్యదర్శి కాసు మాధవి పాల్గొని మాట్లాడారు. మహాసభ అనంతరం వరంగల్‌ జిల్లా నూతన కమిటీని ఎన్నుకున్నారు. సీఐటీయూ వరంగల్‌ జిల్లా నూతన కమిటీ అధ్యక్ష, కార్యదర్శులుగా మహమ్మద్‌ బషీర్‌ అహ్మద్‌, ఆరూరి కుమార్‌, కోశాధికారిగా జన్ను ప్రకాష్‌, ఉపాధ్యక్షులుగా గడ్డం రమేష్‌, ఇనుముల శ్రీనివాస్‌, బోళ్ల కొమురయ్య, సింగారపు కృష్ణ, సహాయ కార్యదర్శులుగా తుమ్మల సాంబయ్య, చాగంటి వెంకటయ్య, కోమలతోపాటు జిల్లా కమిటీ సభ్యులు ఎన్నికయ్యారు. శ్రామిక మహిళ విభాగం కన్వీనర్‌గా కోమలను ఎన్నుకున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -