Monday, December 15, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పోలీసుల సహకారంతో ఉప సర్పంచ్ ఎన్నిక

పోలీసుల సహకారంతో ఉప సర్పంచ్ ఎన్నిక

- Advertisement -

నవతెలంగాణ – మునిపల్లి
మునిపల్లి మండలంలోని మగ్దుంపల్లి గ్రామంలో వాయిదా పడిన ఉపసర్పంచ్ ఎన్నిక పోలీస్ పహార మధ్య సోమవారం జరిగింది. ఆదివారం జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో అటు బీఆర్ఎస్, ఇటు కాంగ్రెస్ పార్టీ ప్రతిపాదించిన అభ్యర్థుల మధ్య 8 వార్డుల గాను సమాన వార్డులలో ఇరు పార్టీల అభ్యర్థులు విజయం సాధించారు. అయితే ఏ పార్టీకి ఉపసర్పంచ్ ఎన్నుకునేందుకు తగిన మెజార్టీ రాకపోవడంతో ఉప సర్పంచ్ ఎన్నిక వాయిదా పడింది. దీంతో తిరిగి సోమవారం ఎన్నికల అధికారి తాజుద్దీన్ తిరిగి వార్డు సభ్యుల సమావేశం ఏర్పాటు చేసి వార్డు సభ్యుల సంఖ్య సమానమైన సందర్భంలో పాటించాల్సిన నిబంధనల ప్రకారం సర్పంచ్ ఓటు, మద్దతు ద్వారా చేతులెత్తే పద్ధతి ద్వారా వార్డు సభ్యురాలు అయిన రామలక్ష్మి శేఖర్ ను ఉప సర్పంచ్ గా ఎన్నికయినట్టు ఖరారు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలలో భాగంగా స్థానిక ఎస్సై రాజేష్ నాయక్ పటిష్ట బందోబస్తు కల్పించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -