Thursday, September 4, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘం మద్నూర్ శాఖ నూతన కమిటీ ఎన్నిక

రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘం మద్నూర్ శాఖ నూతన కమిటీ ఎన్నిక

- Advertisement -
  • – అధ్యక్షులుగా కే రామారావు, అసోసియేట్ అధ్యక్షులుగా మనోహర్ పటేల్
    నవతెలంగాణ – మద్నూర్

    తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగ సంఘం మద్నూర్ శాఖ నూతన కమిటీ ఎన్నికలు ఆదివారం నాడు జరిగాయి. ఈ ఎన్నికలకు ఎన్నికల అధికారులుగా జిల్లా  అసోసియేట్ అధ్యక్షులు జే కాశీనాథ్, మోహన్ రెడ్డి, ఆధ్వర్యంలో ఎన్నికలు జరిగాయి. మద్నూర్ శాఖ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో ఏకగ్రీవంగా జరిగినట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. మద్నూర్ శాఖ అధ్యక్షులుగా కె రామారావు ప్రధాన కార్యదర్శిగా ఎస్ గంగారాం, ఫైనాన్స్ ఆర్థిక కార్యదర్శిగా ఎన్ విటల్, అసోసియేట్ అధ్యక్షులుగా మనోహర్ పటేల్, ఉపాధ్యక్షులుగా శ్రీమతి శకుంతల, నామ్దేవ్, పబ్లిక్ కార్యదర్శిగా జ్ఞానేదాస్, ఆర్గనైజర్ కార్యదర్శిగా ఎస్ గంగారం వీఆర్వో జాయింట్ కార్యదర్శిగా వై యాదవ్ పైన తెలిపిన ప్రకారం ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో ఏకగ్రీవంగా జరిగిన సందర్భంగా ఎన్నికల అధికారులు విశ్రాంత ఉద్యోగులకు అభినందించారు.
- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad