Thursday, November 20, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంమధ్యాహ్న భోజన పథకం కార్మికుల యూనియన్‌(సీఐటీయూ) నూతన రాష్ట్ర కమిటీ ఎన్నిక

మధ్యాహ్న భోజన పథకం కార్మికుల యూనియన్‌(సీఐటీయూ) నూతన రాష్ట్ర కమిటీ ఎన్నిక

- Advertisement -

అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా వై.స్వప్న, ఎస్వీ రమ

నవతెలంగాణ-ఇబ్రహీంపట్నం
తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం కార్మికుల యూనియన్‌(సీఐటీయూ) రాష్ట్ర కమిటీని బుధవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా వై.స్వప్న, ఎస్వీ రమ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం కార్మికుల యూనియన్‌ (సీఐటీయూ) రాష్ట్ర 4వ మహాసభలు ఈ నెల 17, 18 తేదీల్లో రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం కేంద్రంలోని రంజన్‌ నిరులా నగర్‌లో జరిగాయి. మహాసభల ముగింపు రోజు 39మందితో నూతన రాష్ట్ర కమిటీని ఎన్నుకున్నారు. వీరిలో 15 మంది ఆఫీసు బేరర్స్‌గా ఉన్నారు. వారిలో.. అధ్యక్షులుగా వై.స్వప్న, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా కాసు మాధవి, ఉపాధ్యక్షులుగా జి.పద్మ (భద్రాద్రి కొత్తగూడెం), ఉన్ని కృష్ణ (మేడ్చల్‌), మాయ (కొమురం భీం), ఇందుర్తి సులోచన (జగిత్యాల), యాకలక్ష్మీ (సూర్యాపేట), ప్రధాన కార్యదర్శిగా ఎస్వీ రమ (రాష్ట్ర కేంద్రం), కార్యదర్శులుగా సత్యనారాయణ (నల్లగొండ), సుల్తాన్‌ (భద్రాద్రి కొత్తగూడెం), సత్యనారాయణ (నల్లగొండ), కృష్ణామాచారి (కొమరం భీం), సరస్వతి (కామారెడ్డి), కో-ఆప్షన్‌ (నిర్మల్‌), కోశాధికారిగా సీహెచ్‌ బాలక్ష్మీ (సిద్దిపేట) ఎన్నుకున్నారు. మహాసభల సందర్భంగా పలు తీర్మానాలను ఏకగ్రీవంగా ఆమోదించారు. మధ్యాహ్న భోజన కార్మికులకు కనీస వేతనం నిర్ణయించి అమలు చేయాలని, ఎన్నికల హామీ రూ.10వేల వేతనం తక్షణం అమలు చేయాలని, అవసరమైన గ్యాస్‌ను అన్ని పాఠశాలలకూ ఉచితంగా సరఫరా చేయాలని, కార్మికులందరికీ గుర్తింపు కార్డులు, కాటన్‌ చీరలు డ్రెస్‌ కోడ్‌గా ఇవ్వాలని తీర్మానించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -