Thursday, December 4, 2025
E-PAPER
Homeతాజా వార్తలుఎన్నికల 'పంచాయితీ'.. మహిళ ఆత్మహత్య

ఎన్నికల ‘పంచాయితీ’.. మహిళ ఆత్మహత్య

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : నల్లగొండ జిల్లా చిట్యాల మండలం ఏపూరు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో తన కూతురిపై పోటీ చేయాల్సి రావడంతో లక్ష్మమ్మ (40) ఆత్మహత్య చేసుకుంది. లక్ష్మమ్మ బీఆర్ఎస్ మద్దతుతో, ఆమె కూతురు అశ్విని కాంగ్రెస్ మద్దతుతో మూడవ వార్డు నుంచి నామినేషన్లు దాఖలు చేశారు. తల్లిపై తాను పోటీ చేయలేనని అశ్విని నామినేషన్ ఉపసంహరించుకుంది. ఈ విషయంలో తల్లి కూతుళ్ళ కుటుంబాల మధ్య గొడవలు జరిగాయి. ఈ క్రమంలో లక్ష్మమ్మ ఉరేసుకుని సూసైడ్ చేసుకుంది. అయితే కడుపునొప్పి కారణంగా తన భార్య ఆత్మహత్య చేసుకుందని భర్త ఫిర్యాదు చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -