Wednesday, November 12, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఎన్నికల నియమావళిని పకడ్బందీగా అమలుచేయాలి 

ఎన్నికల నియమావళిని పకడ్బందీగా అమలుచేయాలి 

- Advertisement -

యంపీడీఓ పెద్ది ఆంజనేయులు 
నవతెలంగాణ – పరకాల 

తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమీషన్ గ్రామ పంచాయతీలు, మండల పరిషత్ లకు ఎన్నికలు నిర్వహించడానికి నిన్న నోటిఫికేషన్ షెడ్యూల్ జారీ చేసిన విషయం విదితమే. ఈ క్రమంలో వెంటనే ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలు చేయాలని ఆదేశించిన నేపథ్యంలో పరకాల మండల పరిధిలోని ప్రజా ప్రతినిధులు సహకరించాలని పరకాల యంపీడీఓ పెద్ది ఆంజనేయులు విజ్ఞప్తి చేశారు. ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేసిన 24 గంటల లోపు ప్రభుత్వ కార్యాలయాలలో ఎలాంటి ప్రజా ప్రతినిధుల ఫోటోలు కానీ, రాజకీయ రాతలు కానీ తుడిచి వేయాలని సూచించారు. అలాగే 48 గంటల లోపు పబ్లిక్ స్థలాలలో 72 గంటల లోపు ప్రయివేటు ప్రాపర్టీలలో తొలగించాలని,మండల పరిధిలోని పంచాయతీ కార్యదర్శులను ఆదేశించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -