Monday, December 1, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా చూడాలి

ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా చూడాలి

- Advertisement -

– రిటర్నింగ్ అధికారులకు ఎన్నికల సామాగ్రి అందజేత
నవతెలంగాణ-కమ్మర్ పల్లి 
మండలంలో గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా ఎన్నికల సిబ్బంది సమన్వయంతో పని చేయాలని మండల పరిషత్ అభివృద్ధి అధికారి చింత రాజ శ్రీనివాస్ అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయ సమావేశ మందిరంలో  స్టేజ్ వన్ రిటర్నింగ్ అధికారులు, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు, ఫ్లయింగ్ స్క్వాడ్ టీం సభ్యులు, పంచాయతీ కార్యదర్శులతో సమావేశాన్ని నిర్వహించారు. సిబ్బంది తమకు అప్పగించిన ఎన్నికల విధుల్ని సక్రమంగా నిర్వర్తించడం ద్వారా ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా కృషి చేయాలన్నారు. ఎన్నికల విధుల్లో ఎలాంటి అలసత్వానికి ఆస్కారం ఇవ్వద్దని సూచించారు.

అనంతరం రిటర్నింగ్ అధికారులకు గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన మెటీరియల్, సంబంధిత ఫారాలు అందజేశారు. కార్యక్రమంలో మండల పంచాయతీ అధికారి సదాశివ్, స్టేజ్ వన్ రిటర్నింగ్ అధికారులు కే.రాజన్న, కే.గంగాధర్, చౌడారపు రాంప్రసాద్, మధుపాల్, మండల పరిషత్ కార్యాలయ సిబ్బంది,  పంచాయతీ కార్యదర్శులు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -