జిల్లా అబ్జర్వ్ వైజర్ సత్యనారాయణ రెడ్డి
ఎన్నికల సామాగ్రి పరిశీలన
ఎన్నికల సిబ్బందికి అవగాహన సదస్సు
నవతెలంగాణ – రామారెడ్డి
ఎలక్షన్ కమిషన్ నిబంధనల ప్రకారం స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించాలని జిల్లా సాధారణ ఎన్నికల జనరల్ అబ్జర్వ్ వైజాగ్ సత్యనారాయణ రెడ్డి అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని ఎన్నికల సామాగ్రిని స్టోర్ రూమ్ లో పరిశీలించారు. అనంతరం ఎన్నికల సిబ్బందికి అడిషనల్ కలెక్టర్ (లోకల్ బాడీ) మదన్మోహన్ తో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. సకాలంలో ఎన్నికల సామాగ్రిని అందించాలని, పోలింగ్ కేంద్రాల్లో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, ఎలాంటి సమస్యలు వచ్చినా వెంటనే పరిష్కరించి ఓటర్లకు ఇబ్బంది కలగకుండా చూడాలని సూచించారు. ఎన్నికల విధులను పారదర్శకంగా నిర్వహించాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీడీవో నాగేశ్వర్ గుప్తా, ఎంపీవో తిరుపతిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
నిబంధనల ప్రకారం ఎన్నికలు నిర్వహించాలి..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



