Saturday, August 9, 2025
E-PAPER
spot_img
Homeట్రెండింగ్ న్యూస్తెలంగాణ ప్రజలకు అదిరిపోయే శుభవార్త..ఎలక్ట్రిక్ రైళ్లు!

తెలంగాణ ప్రజలకు అదిరిపోయే శుభవార్త..ఎలక్ట్రిక్ రైళ్లు!

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అదిరిపోయే శుభవార్త అందింది. అతి త్వరలోనే తెలంగాణ రాష్ట్రంలో మెయిన్ లైన్ ఎలక్ట్రిక్ మల్టిపుల్ యూనిట్ రైళ్లు పరుగులు పెడతాయని అధికారిక ప్రకటన వెలువడింది. తెలంగాణ రాష్ట్రంలోని గ్రామీణ అలాగే సేమియా అర్బన్ ప్రాంతాలను అనుసంధా నించేలా త్వరలోనే మెయిన్ లైన్ ఎలక్ట్రిక్ మల్టిపుల్ యూనిట్ రైళ్ళను నడుపుతామని తాజాగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కీలక ప్రకటన చేశారు.

16 నుంచి 20 కోచ్‌లు ఉండే ఈ రైళ్ల ద్వారా పండుగలు అలాగే ఇతర సమయాలలో ప్రయాణికులకు సౌకర్యవంతంగా ఉంటుందని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. అదే సమయంలో కాజీపేటలో రైలు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ నిర్మాణం జనవరి నాటికి పూర్తి చేసి అదే సమయంలో మే నుంచి ఉత్పత్తి ప్రారంభిస్తామని కూడా తెలిపారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img