- Advertisement -
నవతెలంగాణ – కాటారం
కాటారం మండలంలోని చిదిన పెల్లి గ్రామంలో విద్యుత్తు శాఖ గురువారం రోజున విద్యుత్ శాఖ పల్లెబాట కార్యక్రమాన్ని నిర్వహించారు. వర్షకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చెప్పుతూ ప్రజలు వర్షం పడుతున్నప్పుడు ఎట్టి పరిస్థితిలో స్తంభాలను ముట్టుకోవద్దని, రైతులు మోటార్ ఆన్ చేసే ముందు చెప్పులు లేకుండా మోటార్ ఆన్ చేయరాదని వివరించడం జరిగింది. కార్యక్రమంలో ఏడీఈ నాగరాజు, ఏఈ బి.ఉపేందర్ , లైనమన్ చంద్రమౌళి, గ్రామా ప్రజలు, రైతులు పాల్గొన్నారు.
- Advertisement -