నవతెలంగాణ – కంఠేశ్వర్
తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ నిజామాబాద్ జిల్లా జనరల్ బాడి సమావేశం బుధవారం పవర్ హౌస్ మీటింగ్ హాల్ లో ఘనంగా నిర్వహించారు. ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా అసోసియేషన్ పౌండర్ సెక్రటరీ జనరల్ మాతంగి శ్రీనివాస్ ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ ఎస్టీ ఉద్యోగుల సమస్యలపై పోరాటం చేస్తున్నామని ఇంకా అనేక సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదు.. రాష్ట వ్యాప్తంగా సంస్థలొ ఐక్యంగా ఉద్యమాలు చేపడతామని చెప్పారు. ఈ కార్యక్రమంలో కంపెని కార్యదర్శి బి సుదర్శన్ మాట్లాడుతూ.. అవినీతికి ఆస్కారం లేకుండా పని చేస్తూ సంస్థను ముందుకు తీసుకెల్లాలని కోరడం జరిగింది..జిల్లా అద్యక్షులు బి చెన్నయ్య ఆద్యక్షతన జరిగిన ఈ సమావేశంలో కంపెని అద్యక్షులు బి మన్నె శ్రీరాం, అసోసియేషన్ కార్యదర్శి కె బాల్ చందర్ అన్ని డివిజన్ల అద్యక్ష కార్యదర్శులు వసంత్ రావు, రాంచందర్ , ఎం ఆర్ టి శంకర్, లచ్చయ్య, వినోకర్ , బోదన్ డివిజన్ నాయకులు వెంకటేశ్వర్ , స్వామి, రాజలింగం తదితరులు పాల్గొన్నారు.
ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ అసోసియేషన్ జనరల్ బాడీ సమావేశం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES