- Advertisement -
నవతెలంగాణ హైదరాబాద్: జీహెచ్‌ఎంసీ పరిధిలో ఇటీవల వరుసగా చోటుచేసుకుంటున్న ప్రమాదాలపై విద్యుత్ శాఖ అధికారుల్లో కదలిక వచ్చింది. రామాంతాపూర్, పాతబస్తీ బండ్లగూడలో జరిగిన విద్యుత్ ప్రమాదాలపై విద్యుత్ శాఖ అధికారులు దిద్దుబాటు చర్యలు చేపట్టారు. జీహెచ్‌ఎంసీ పరిధిలోని వివిధ డివిజన్‌లలో కరెంటు స్తంభాలకు ప్రమాదకరంగా వేలాడుతున్న కేబుళ్లను అధికారులు తొలగిస్తున్నారు. ఉప్పల్, రామాంతాపూర్, చిలకానగర్‌లలో విద్యుత్ అధికారులు ప్రత్యేక డ్రైవ్ చేపట్టారు.
- Advertisement -