జీఈఎంఎస్‌తో ఒప్పందం
హైదరాబాద్ : ఎలక్ట్రిక్ బస్ లీజింగ్ సొల్యూషన్‌ను ప్రారంభించినట్టు ఎలెక్ట్రిగో కో ఫౌండర్ సుధీంద్ర రెడ్డి పిడపా తెలిపారు. 50 ఎలక్ట్రిక్ బస్సుల పంపిణీ కోసం గ్రీన్ ఎనర్జీ మొబిలిటీ సొల్యూషన్స్ లిమిటెడ్‌తో ఎలక్ట్రిగో ఒప్పందం కుదుర్చుకుంది. ఫుల్ స్టాక్ ఎలక్ట్రిక్ బస్ లీజింగ్ ప్లాట్‌ఫారంగా ఉన్న ఎలెక్ట్రిగో ప్రయివేటు బస్ ఆపరేటర్లను లక్ష్యంగా చేసుకుని తన ఎలక్ట్రిక్ బస్ లీజింగ్ సేవలను మంగళవారం అధికారికంగా ప్రారంభించింది. ఈ సందర్భంగా సుధీంద్ర రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ఎలెక్ట్రిగో కీలక మార్గాల్లో 50 ఎలక్ట్రిక్ బస్సులను అమలు చేసేందుకు గ్రీన్ ఎనర్జీ మొబిలిటీ సొల్యూషన్స్ లిమిటెడ్ (జీఈఎంఎస్)తో ఒక అవగాహన ఒప్పందం కుదుర్చుకుందన్నారు.
ఎలక్ట్రిక్ బస్సులను దేశవ్యాప్తంగా మరింత సులభంగా, మరింత వాణిజ్యపరంగా ప్రయోజనకరంగా అందిస్తున్నామన్నారు. జీఈఎంఎస్, జీల్ మొబిలిటీ డైరెక్టర్ సునిల్ కుమార్ రవీంద్రన్ మాట్లాడుతూ.. ఎలక్ట్రిక్ బస్సులు, ట్రక్కులు, మైనింగ్ పరికరాలు, హై-క్యాపాసిటీ చార్జింగ్ సామర్థ్యాలను కలిపి, పైలట్లకే పరిమితం కాకుండా వాస్తవ ప్రాజెక్టుల అమలుపై దృష్టి పెట్టామన్నారు. ఆర్థిక సంవత్సరం 2026-27 నాటికి 200 బస్సులు, 150 ట్రక్కులు, 50 మైనింగ్ మెషీన్లకు విస్తరించాలనే స్పష్టమైన రోడ్‌మ్యాప్‌తో పని చేస్తున్నామన్నారు.
ఎలక్రిక్ బస్ లీజింగ్‌లోకి ఎలక్ట్రిగో
- Advertisement -
- Advertisement -



