Wednesday, September 17, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్అర్హులైన లబ్ధిదారులు దరఖాస్తు చేసుకోవాలి

అర్హులైన లబ్ధిదారులు దరఖాస్తు చేసుకోవాలి

- Advertisement -

నవతెలంగాణ-పెద్దవూర
జాతీయ కుటుంబ ప్రయోజన పథకం కింద 18 సంవత్సరాలు నుండి 59 సంవత్సరాల వయసుగల వారు కుటుంబ యజమాని చనిపోయినచో వారి కుటుంబాలకు రూ.20 వేల ఏక మొత్తంలో ఇచ్చే విధంగా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈనెల 25 తేదీ వరకు మండలంలోని అన్ని గ్రామాల అర్హులైన లబ్ధిదారులు మృతుల వారసులు దరఖాస్తులను నింపి సంబంధిత ధ్రువపత్రాలతో ఆయా గ్రామ పంచాయతీలలో సమర్పించవలెనని మండల అభివృద్ధి అధికారి ఉమాదేవి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.

దరఖాస్తుదారుడు దరఖాస్తుతో పాటు చనిపోయిన వారి మరణ ధ్రువీకరణ పత్రము, దరఖాస్తుదారుని ఆధార్ కార్డు, ఆదాయ ధ్రువీకరణ పత్రం, రేషన్ కార్డు, రెండు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు, బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ మొదలగు అన్ని సర్టిఫికెట్లు జత చేసి రెండు కాపీలు గ్రామ పంచాయతీలో సమర్పించవలెనని కోరారు. ఈ నెల 25 వ తేదీ  సాయంత్రం వరకు పంచాయతీ కార్యదర్శులు గ్రామపంచాయతీలో దరఖాస్తులు సేకరించవలెనని తెలిపారు. అట్టి దరఖాస్తులను సాయంత్రం 5 గంటలకు మండల పరిషత్ కార్యాలయంలో సబ్మిట్ చేయాలని చెప్పారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -