- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : వెనిజులాలో ఉద్రిక్తతల నేపథ్యంలో ట్విట్టర్ అధినేత ఎలాన్ మస్క్ కీలక ప్రకటన చేశారు. దేశంలో సంక్షోభం నేపథ్యంలో నెలరోజుల పాటు స్టార్ లింక్ ద్వారా ఉచిత బ్రాడ్ బాండ్ సేవలు అందిస్తున్నట్టు ప్రకటించారు. ఈ విషయాన్ని మస్క్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. వెనిజులా ప్రజలకు మద్దతుగా ఈ చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. శాటిలైట్ సమూహం ద్వారా పనిచేసే స్టార్ లింక్ నెట్ వర్క్ రాజకీయ, భద్రతా అనిశ్చితి కాలంలో ఇంటర్నెంట్ సేవలు అందించడానికి సహాయపడుతుందని భావిస్తున్నట్టు తెలిపారు. ఫిబ్రవరి 3 వరకు ప్రజలకు ఉచిత ఇంటర్నెట్ సేవలు అందుతాయని స్పష్టం చేశారు.
- Advertisement -



