Tuesday, December 9, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పోస్టల్ బ్యాలెట్ పై ఉద్యోగుల అనాసక్తి

పోస్టల్ బ్యాలెట్ పై ఉద్యోగుల అనాసక్తి

- Advertisement -

నవతెలంగాణ-పాలకుర్తి
గ్రామపంచాయతీ ఎన్నికల సందర్భంగా నిర్వహించే పోస్టల్ బ్యాలెట్ పై ఉద్యోగస్తులు అనాసక్తి కనబరుస్తున్నారని డిటిఎఫ్ మండల అధ్యక్ష కార్యదర్శులు చిదురాల శ్రీనివాస్, దేవగిరి సూర్యప్రకాష్ తెలిపారు. మంగళవారం వారు మాట్లాడుతూ ఉద్యోగులు పోస్టల్ ఓటును వినియోగించుకునేలా ఎన్నికల కమీషన్ ఇప్పటికే ఇచ్చిన ఉత్తర్వులను సడలింపు చేయాలని డిమాండ్ చేశారు. పరిమితంగా ఉండే ఉద్యోగుల పొస్టల్ బాలెట్స్ సాధారణ ఓటర్ల మాదిరిగానే స్వస్తిక్ గుర్తుతో ఓటు హక్కు వినియోగించుకునేలా అవకాశం కల్పించి, సాధారణ ఓట్లతో లెక్కింపు చేసేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. పోస్టల్ బాలెట్స్ ను ముందుగా లెక్కించడం వలన ఓటు రహస్యం బహిర్గతం అవుతుందని అన్నారు.  స్వస్థిక్ మార్కుతో ఓటు వినియోగించుకునేలా   ఓట్లను సాధారణ ఓట్లతో కలిపి లెక్కిస్తే ఓటు రహస్యం బహిర్గతం కాకుండా ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఉద్యోగులకు అవకాశం ఉంటుందని, వెంటనే ఆ దిశగా ఉత్తర్వులు ఇచ్చి ఉద్యోగులు ఓటు హక్కు వినియోగించుకునేలా చూడాలని అన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -