నవతెలంగాణ – కంఠేశ్వర్ : టీజీఈ జేఏసీ రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు ఎంప్లాయిస్ జేఏసీ జిల్లా చైర్మన్, టీఎన్జీవో జిల్లా అధ్యక్షులు నాశెట్టి సుమన్ కుమార్ అధ్యక్షతన పెన్షన్ విద్రోహ దినోత్సవాన్ని పురస్కరించుకొని సోమవారం నిజామాబాద్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ఎదుట సిపిఎస్ భూతాన్ని అంతం చేయాలని డిమాండ్ చేస్తూ నల్ల టీషర్ట్లు, నల్ల బ్యాడ్జీలు ధరించి ఎంప్లాయిస్ జేఏసీ నందు గల భాగస్వామ్య సంఘాల జిల్లా అధ్యక్ష కార్యదర్శులు, అన్ని శాఖల ఫోరం అధ్యక్ష కార్యదర్శులు, ఉద్యోగులు, మహిళా ఉద్యోగ సోదరీమణులందరూ కలిసి సామూహికంగా నిరసన నిరసన కార్యక్రమం చేపట్టారు.
అనంతరం రాష్ట్ర జేఏసీ ఆధ్వర్యంలో ఆర్టీసీ కళ్యాణ మండపం బాగ్ లింగంపల్లి హైదరాబాద్ నందు ఏర్పాటుచేసిన పాత పెన్షన్ సాధన పోరాట సభ కార్యక్రమానికి నిజామాబాద్ ఎంప్లాయిస్ జేఏసీ జిల్లా పక్షాన 400 మందికి పైగా ఉద్యోగ సంఘ నాయకులు, ఉద్యోగులు తరలి వెళ్లారు. ఈ సందర్భంగా ఎంప్లాయిస్ జేఏసీ చైర్మన్, టీఎన్జీవోఎస్ జిల్లా అధ్యక్షులు నాశెట్టి సుమన్ కుమార్ మాట్లాడుతూ..ఉద్యోగుల హక్కుల సాధన కొరకై, ఉద్యోగుల డిమాండ్ల కొరకై, సిపిఎస్ భూతాన్ని అంతం చేసే వరకు ఇట్టి పోరాటాలను మరింత ఉధృతం చేసి, ఉద్యమించి, పాత పెన్షన్ విధానాన్ని మరియు ఉద్యోగుల పెండింగ్ సమస్యలు అన్నింటిని సాధించుకునేంత వరకు పోరాటాలు ఆపేది లేదని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో టిి జి ఈ జేఏసీ జిల్లా కో చైర్మన్లు రమణ రెడ్డి, సురేష్, కృష్ణారెడ్డి, నేరెళ్ల శ్రీనివాస్, మోహన్,టిి జి ఈ జేఏసీ జిల్లా కార్యవర్గ సభ్యులు నేతికుంట శేఖర్, శ్రీకాంత్ ,వినోద్, ప్రశాంత్, బాలయ్య, అమృత్ కుమార్, చిట్టి నారాయణరెడ్డి, నాగరాజు,పోల శ్రీనివాస్, జాఫర్ హుస్సేన్ , జాకీర్ హుస్సేన్, కృష్ణమూర్తి, విజయలక్ష్మి,స్వామి, మాణిక్యం, శంతన్, వినీత ,శశికాంత్ రెడ్డి, సృజన్ కుమార్, రాజశేఖర్ ,ప్రవీణ్ రాజ్ ,జ్ఞానేశ్వర్ రెడ్డి, సూర్య ప్రకాష్, మంజుల,ఇందిరా, గీతారెడ్డి శ్రీవేణి, పద్మ, విజయలక్ష్మి ,శ్రీప్రియ, తదితరులు మరియు ఉద్యోగులు మహిళా ఉద్యోగ సోదరిమణులు అధిక సంఖ్యలో హాజరయ్యారు.