Monday, December 15, 2025
E-PAPER
Homeజాతీయంఉపాధి హామీ పేరు మార్పు బిల్లుకు ఆమోదం

ఉపాధి హామీ పేరు మార్పు బిల్లుకు ఆమోదం

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం(MGNREGA) పేరును మార్చుతూ పార్ల‌మెంట్ లో కేంద్రం ప్ర‌వేశ పెట్టిన బిల్లుకు ఆమోదం ల‌భించింది. ఈమేర‌కు ది వికసిత్ భారత్.. గ్యారంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ అజీవక మిషన్ గ్రామీణ్(VBGRAMG)గా మార్చ‌బ‌డింది. కొత్త పథకం ప్రకారం.. పని దినాల సంఖ్య 125 రోజులకు పెరగనుంది. గతంలో 100 రోజుల పని మాత్రమే ఉండేది.

తొలుత ఈ పథకం NREGAగా 2005లో అమలులోకి వచ్చింది. కాగా అప్పటి యూపీఏ ప్రభుత్వం 2009 అక్టోబర్ 02 నుంచి దేశవ్యాప్తంగా మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం(MGNREGA)గా పేరు మార్చింది. ఈ పథకం కింద.. ప్రతి గ్రామీణ నిరుపేద కుటుంబానికి ఒక ఆర్థిక ఏడాదిలో 100 రోజుల ఉపాధి పొందే హక్కు ఉంటుంది. దీని పనితీరును పరిశీలించేందుకు 2022లో ఓ ప్రత్యేక కమిటీని నియమించింది ఎన్డీఏ ప్రభుత్వం. ఆ కమిటీ తన నివేదికను గతేడాది ప్రభుత్వానికి సమర్పించింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -