Tuesday, July 29, 2025
E-PAPER
Homeజాతీయంఛ‌త్తీస్‌గ‌డ్‌లో ఎన్‌కౌంట‌ర్..

ఛ‌త్తీస్‌గ‌డ్‌లో ఎన్‌కౌంట‌ర్..

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: ఛత్తీస్‌గఢ్‌లో భద్రతాబలగాల కు, మావోయిస్టుల కు మధ్య ఎన్‌కౌంటర్‌ జరుగుతోంది. సుక్మా జిల్లాలోని అటవీ ప్రాంతంలో మావోయిస్టుల కదలికలు ఉన్నాయని సమాచారం అందుకున్న భధ్రతాబలగాలు అక్కడికి వెళ్లి కూంబింగ్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా మావోయిస్టులు తారసపడటంతో ఎదురుకాల్పులు జరుగుతున్నాయి.

సుక్మా డిస్ట్రిక్ట్ రెస్పాన్స్‌ గ్రూప్‌ , సెంట్రల్‌ రిజర్వ్‌డ్ పోలీస్‌ ఫోర్స్‌ , స్పెషల్ టాస్క్‌ ఫోర్స్‌ , స్థానిక పోలీసులు సంయుక్తంగా ఈ కూంబింగ్‌ ఆపరేషన్‌ చేపట్టారు. ఈ విషయాన్ని సుక్మా జిల్లా ఎస్పీ కిరణ్‌ చవాన్‌ మీడియాకు వెల్లడించారు. ఎన్‌కౌంటర్‌కు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -