నవతెలంగాణ-హైదరాబాద్: మావోయిష్టులు శాంతి చర్చలకు సిద్దమని ప్రకటించినా..కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ పేరుతో అడవుల్లో బరితెగిస్తుంది. తాజాగా ఛత్తీస్‌గడ్‌లో మరోసారి తుపాకుల మోత మోగింది. సుక్మా జిల్లా పరిధిలో డీఆర్జీ బలగాలు కూంబింగ్ నిర్వహించాయి. ఈక్రమంలో మావోయిష్టులు దట్టమైన అడవుల్లో బలగాలకు తారసపడ్డారు. ఇరువర్గాల ఎదురుకాల్పుల్లో ఓ మావోయిష్టు చనిపోయినట్టు బస్తర్ రేంజ్ ఆఫీసర్ పీ.సుందర్‌రాజ్ తెలిపారు. మృతి చెందిన వ్యక్తిని కెర్లాపాల్ ఏరియా కమిటీ సభ్యునిగా గుర్తించామని, అతనిపై రూ.5 లక్షల రివార్డ్ ఉందని వెల్లడించారు.
అదే విధంగా సంఘటన స్థలంలో పెద్ద మొత్తంలో పేలుడు పదార్థాలు, ఆయుధాలు స్వాధీనం చేసుకున్నామన్నారు. ఈ ఆపరేషన్‌లో బారెల్ గ్రెనేడ్ లాంచర్ పేలి రిజర్వ్ గార్డ్ (DRG) జవాన్లకు గాయాలైనట్లు చెప్పారు.