Wednesday, November 26, 2025
E-PAPER
Homeజాతీయంఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్‌

ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్‌

- Advertisement -

ముగ్గురు మావోయిస్టుల మృతి

బీజాపూర్‌ : ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం, తెలంగాణ సరిహద్దుల్లోని బీజాపూర్‌ జిల్లాలో బుధవారం మావోయిస్టులు, పోలీసుల మధ్య తీవ్రమైన ఎదురుకాల్పులు జరిగాయి. తాళ్లగూడెం పోలీస్‌స్టేషన్‌ పరిధిలోకి వచ్చే అన్నారం-మరిమల అడవుల్లో ఈ ఘటన చోటు చేసుకుంది. భద్రతా దళాలు చేపట్టిన సెర్చ్‌ ఆపరేషన్‌ కొనసాగుతుండగానే మావోయిస్టులు కాల్పులు ప్రారంభించినట్టు పోలీసులు తెలిపారు. ఈ కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు హతమైనట్టు ప్రాథమిక సమాచారం. ఘటనా స్థలం నుంచి భద్రతా దళాలు భారీగా ఆయుధాలు, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నాయి. ప్రస్తుతం ఆ ప్రాంతంలో కాల్పులు ఇంకా కొనసాగుతున్నట్టు సమాచారం. భద్రతా దళాలు అదనపు బలగాలను రంగంలోకి దించి, ఆ ప్రాంతంలో విస్తృత గాలింపు చర్యలను కొనసాగిస్తున్నాయి. ఈ ఎదురుకాల్పుల్లో ఎంతమంది మావోయిస్టులు మరణించారు? లేదా గాయపడ్డారు అనే దానిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

2025లో మావోయిస్టు వ్యతిరేక చర్యలు ఉధృతం
ఈ ఏడాది ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టు వ్యతిరేక కార్యకలాపాలు సంచలనం సృష్టిస్తున్నాయి. కేవలం బీజాపూర్‌ జిల్లాలోనే ఈ ఏడాది 461 మంది మావోయిస్టులు లొంగిపోయారు. అదే సమయంలో 138 మంది ఎదురుకాల్పుల్లో హతమైతే, 485 మంది అరెస్టు అయ్యారు. ఇటీవల కంకేర్‌, బీజాపూర్‌లో ఏకంగా 72 మంది మావోయిస్టులు ఒకేసారి ఆయుధాలు వదిలి లొంగిపోవడం గమనార్హం. మావోయిస్టు పార్టీలో పెరుగుతున్న అంతర్గత కలహాలు, భద్రతా దళాల నిరంతర ఒత్తిడి కారణంగానే ఈ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -