- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : జమ్ముకశ్మీర్ లోని పూంచ్ లో బుధవారం భద్రతా దళాలు ఎన్కౌంటర్ నిర్వహించారు. ఈ ఎన్కౌంటర్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. సరిహద్దు నుంచి దేశంలోకి చొరబడేందుకు యత్నిస్తున్న క్రమంలో భద్రతా దళాలు వారిపై కాల్పులు జరిపాయి. కాగా.. రెండ్రోజుల క్రితమే ఆపరేషన్ మహదేవ్ లో భారత ఆర్మీ పహల్గామ్ ఉగ్రదాడికి కారణమైన సూత్రధారిని మట్టుపెట్టింది. ఆపరేషన్ సిందూర్ పై పార్లమెంట్ లో జులై 28న చర్చ మొదలవ్వగా అదే సమయంలో పహల్గామ్ ఉగ్రదాడి చేసిన వారిలో ముగ్గురు ఉగ్రవాదుల్ని భారత ఆర్మీ అంతమొందించిందన్న వార్తలపై దేశమంతా హర్షం వ్యక్తం చేసింది.
- Advertisement -