- Advertisement -
నవతెలంగాణ హైదరాబాద్: ఆపరేషన్ కగార్ లో భాగంగా జార్ఖండ్ రాష్ట్రంలోని హజారిబాగ్ అటవీ ప్రాంతంలో భద్రత జలగాలు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్ కౌంటర్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు సహదేవ్ సోరెన్ తో పాటు మరో ఇద్దరు మావోయిస్టులు తీవ్ర బుల్లెట్ గాయాలతో అక్కడికక్కడే మృతి చెందారు. అయితే, మృతుడు సహదేవ్ పై రూ.కోటి రివార్డు ఉంది. ఈ మేరకు భద్రతా బలగాలు ఎన్ కౌంటర్ జరిగిన ప్రాంతాంలో భారీగా ఆయుధాలు, ఇతర సామాగ్రి స్వాధీనం చేసుకున్నారు.
- Advertisement -