Thursday, March 19, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంనిరవధిక నిరాహార దీక్ష విరమణ

నిరవధిక నిరాహార దీక్ష విరమణ

- Advertisement -

ప్రభుత్వాస్పత్రిని వంద పడకలకు పెంచాలన్న డిమాండ్‌ న్యాయమైనదే.. : చౌటుప్పల్‌ ఆర్డీఓ శేఖర్‌రెడ్డి
నవతెలంగాణ-రామన్నపేట

రామన్నపేట మండల కేంద్రంలోని ప్రభుత్వాస్పత్రిని వంద పడకల స్థాయికి పెంచాల్సిన అవసరం ఉందని చౌటుప్పల్‌ ఆర్డీఓ శేఖర్‌రెడ్డి అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండల కేంద్రంలోని ప్రభుత్వాస్పత్రిని వంద పడకలకు పెంచాలని, మెరుగైన వైద్య సేవలు అందించాలని, ప్రస్తుత బడ్జెట్‌లో రూ.40 కోట్లు కేటాయించాలని డిమాండ్‌ చేస్తూ సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్న వారికి బుధవారం ఆర్డీఓ నిమ్మరసం అందజేసి విరమింపజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వంద పడకల ఆస్పత్రిగా అభివృద్ధి చేయాలని, నూతన భవనాలు నిర్మించాలన్న ప్రజల కోరిక న్యాయమైనదేనని తెలిపారు.

వంద పడకల ఆస్పత్రి అయ్యే వరకు వెంట పడతాం : మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు
”రామన్నపేటని ప్రభుత్వాస్పత్రి వంద పడకలకు అభివృద్ధి చేసేవరకు వెంట పడుతూనే ఉంటాం.. ఉద్యమాలు నిర్వహిస్తూనే ఉంటాం” అని మాజీ ఎమ్మెల్సీ చేరుపల్లి సీతారాములు అన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఎండి.జహంగీర్‌, తదితర నాయకులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -