- Advertisement -
నీటి పారుదుల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
ఇరిగేషన్ రంగానికి ఇంజినీర్లు ములస్తంభాలని రాష్ట్ర నీటిపారుదల శాఖామంత్రి ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు తెలంగాణా నీటిపారుదల శాఖా ఇంజినీర్ల సంఘం రూపొందించిన క్యాలెండర్‌తో పాటు డైరీని ఆయన గురువారం హైదరాబాద్‌లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నీటిపారుదల రంగం బలోపేతానికి ఇంజినీర్లు మరింత కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం గౌరవ అధ్యక్షులు కే. సుదీర్‌రెడ్డి, అధ్యక్షులు శ్రీధర్ ప్రధాన కార్యదర్శి బి.గోపాలకృష్ణ, కార్యనిర్వాహక అధ్యక్షులు ప్రకాష్, వెంకట్ నారాయణ, ఉషారాణి, మహేందర్‌నాథ్ తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



